SPY Movie - పాటలతో మొదలైన స్పై ప్రమోషన్స్

Nikhil's SPY movie - నిఖిల్ తాజా చిత్రం స్పై. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update: 2023-06-12 03:01 GMT

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ 2" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ఇప్పుడు వరుస సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఇతడి లైనప్ కూడా అంతే క్రేజీగా ఉంది.

కార్తికేయ-2 తర్వాత సిద్ధార్థ్ నుంచి వస్తున్న సినిమా స్పై. ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమాను, ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించాడు. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ స్టోరీ, డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు పాటల ప్రమోషన్ మొదలైంది.

జూమ్ జూమ్ అంటూ సాగే ఈ పాట నికిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్ మధ్య వచ్చే లవ్ రొమాంటిక్ సాంగ్. అనురాగ్ కులకర్ణి, రమ్య బేహారా పాడిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాశాడు. సీతారమమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ మ్యూజికల్ ఆల్బమ్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

"తూటాలే పేలుస్తుంటే నీ చిరు నగవే. అందాల గాయం తగిలే నా ఎదకే" వంటి లిరిక్స్ బాగున్నాయి. కమ్మని పదాలతో సాగే మెలోడీ సాంగ్ శ్రోతల మనసు దోచేసింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో జూన్ 29 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    
Advertisement

Similar News