Aadikeshava | సిత్రాల సిత్రావతి వచ్చేసింది

Aadikeshava Movie - వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆదికేశవ్. ఈ మూవీ నుంచి మెలొడీ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update: 2023-09-10 16:22 GMT

'ఉప్పెన' చిత్రంతో హీరోగా మారాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో క్లిక్ అవ్వలేకపోయాడు. ఇప్పుడు ఆయన 'ఆదికేశవ' అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.

యువ సంచలనం శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అపర్ణా దాస్, జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ స్వరకర్త, జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి 'సిత్తరాల సిత్రావతి' అంటూ సాగే మొదటి పాటను తాజాగా విడుదల చేశారు.

హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ ఇది. వైష్ణవ్ తేజ్ తన ప్రియురాలు శ్రీలీలను 'సిత్తరాల సిత్రావతి' అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే గీతం ఇది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహర పాడారు. 

Full View

Tags:    
Advertisement

Similar News