Nenu Student Sir - బెల్లంకొండ గణేశ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్

Nenu Student Sir - బెల్లంకొండ గణేశ్ నటించిన తాజా చిత్రం నేను స్టూడెంట్ సర్. ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2023-05-13 07:39 GMT

‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, ఈసారి 'నేను స్టూడెంట్ సార్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీతో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు ఈ బెల్లంకొండ హీరో. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై సతీష్ వర్మ నిర్మించారు. ఇంతకుముందు నాంది సినిమాను నిర్మించాడు ఈ నిర్మాత. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్ సింగిల్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే, ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ తో వచ్చారు మేకర్స్. ‘నేను స్టూడెంట్ సార్!’’ జూన్ 2న థియేట్రికల్ గా రిలీజ్ అవుతుంది. జూన్ రెండవ వారం తర్వాత విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తాయి కాబట్టి ఇది అనువైన డేట్ అని భావిస్తున్నారు మేకర్స్.

గణేష్ సరసన అవంతిక దస్సాని ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా. ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి ప్రమోషన్స్ జోరు పెంచారు.

సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనన్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య కథ అందించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందించాడు. ఈ సినిమాతో సెకెండ్ సిండ్రోమ్ దాటాలనుకుంటున్నాడు బెల్లంకొండ. ఎందుకంటే, రెండో సినిమా గండం అనేది చాలామంది హీరోలకు పెద్ద పరీక్ష.

Tags:    
Advertisement

Similar News