Nayanthara - పిల్లల పేర్లు బయటపెట్టిన నయనతార

Nayanthara - నయనతారకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లకు తన పిల్లల పేర్లు బయటపెట్టింది నయన్.

Advertisement
Update: 2023-04-03 14:24 GMT

నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అది వివాదాస్పదమైన సంగతి కూడా తెలిసిందే. మొత్తానికి ఎలాగోలా ఆ వివాదం నుంచి గట్టెక్కింది నయనతార-విఘ్నేష్ జంట. మరోవైపు పిల్లలు కూడా పెద్దవాళ్లు అవుతున్నారు.

అయితే ఓవైపు ఇంత జరుగుతున్నప్పటికీ, మరోవైపు తమ పిల్లల పేర్లను మాత్రం ఈ జంట వెల్లడించలేదు. ఎట్టకేలకు ఆ టైమ్ రానే వచ్చింది. తన ఇద్దరు కొడుకుల పేర్లను నయనతార బయటపెట్టింది. ఒక కొడుక్కి ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ అనే పేరును, మరో కొడుక్కి ఉలగ్ దైవిక్ ఎన్ శివన్ అనే పేరును పెట్టింది ఈ జంట.

కోలీవుడ్ లో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్ లో నిండు సభలో ఇలా తమ ఇద్దరి పిల్లల పేర్లను ఆర్భాటంగా ప్రకటించింది నయనతార. పెళ్లయి 9 నెలలు నిండకుండానే తను తల్లయినట్టు ప్రకటించింది నయనతార. అప్పట్నుంచి వివాదం రాజుకుంటూనే ఉంది.

పెళ్లికి ముందే నయన్ గర్భం దాల్చిందంటూ చాలామంది విమర్శించారు. కానీ తను సరోగసీ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చానని, అంతా చట్టప్రకారమే జరిగిందని నయనతార క్లారిటీ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News