Nayanthara | పుకార్లకు చెక్ పెట్టిన నయనతార, ఇంతకీ ఏంటా పుకారు?

Nayanthara - దర్శకుడు అట్లీతో నయనతారకు పడట్లేదా? ఈ అంశంపై పరోక్షంగా స్పందించింది ఈ హీరోయిన్.

Advertisement
Update: 2023-09-22 08:24 GMT

ఆ లాజిక్ మిస్ అయిన నయనతార కలెక్షన్లు ఘోరంగా ఉన్నాయిగా..

జవాన్ దర్శకుడు అట్లీపై నయనతార సీరియస్ గా ఉందని, తనను సైడ్ చేయడంపై అట్లీపై ఆమె ఆగ్రహంతో ఉందంటూ 2 రోజులుగా కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో నయనతార కనిపించకపోవడమే.

రీసెంట్ గా ముంబయిలో జవాన్ సక్సెస్ మీట్ జరిగింది. దీనికి షారూక్, దీపిక పదుకోన్, అట్లీ హాజరయ్యారు. అయితే అక్కడ నయనతార కనిపించలేదు. నయన్ ను కావాలనే సైడ్ చేశారని, ఆమెకు బాలీవుడ్ లో క్రేజ్ రాకుండా చేసేందుకు ఇలా చేశారని, ఈ విషయంలో అట్లీ కీలక పాత్ర పోషించినట్టు కథనాలు వచ్చాయి.

జరిగిన ఘటనపై నయనతార కూడా అట్లీపై సీరియస్ అయినట్టు ఊహాగానాలు చెలరేగాయి. ఈ పుకార్లకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది నయనతార. అట్లీ పుట్టినరోజు సందర్భంగా, తన ఇనస్టాగ్రామ్ పేజీలో అతడికి శుభాకాంక్షలు తెలిపింది. అక్కడితో ఆగలేదామె.

అట్లీని తన పోస్టు లో పొగడ్డమే కాకుండా.. జవాన్ విజయం అట్లీతోనే సాధ్యమైందని పరోక్షంగా వెల్లడించింది. తన కెరీర్ కు అట్లీ ఎంతగానో హెల్ప్ అయ్యాడనే విధంగా పోస్ట్ పెట్టింది. దీంతో నయనతార-అట్లీ మధ్య గొడవ జరిగిందనే పుకార్లకు చెక్ పడింది. నయనతారకు రాజా-రాణి సినిమాతో బిగ్గెస్ట్ హిట్టిచ్చాడు అట్లీ. ఇప్పుడు జవాన్ సినిమాతో ఆమెను బాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం చేశాడు.

Tags:    
Advertisement

Similar News