Nara Rohit | నారా రోహిత్ రీఎంట్రీకి రెడీ

Nara Rohit - నారా రోహిత్ రీఎంట్రీ రెడీ అయింది. అతడి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ అవుతోంది

Advertisement
Update: 2023-07-23 07:39 GMT

సినిమాల నుంచి కొంత కాలం విరామం తీసుకున్న నారా రోహిత్ కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి బాణం, సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎంచుకొని, విలక్షణ నటుడు అనిపించుకున్నాడు.

రోహిత్ తన కమ్ బ్యాక్ మూవీ కోసం ఒక యూనిక్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. కెరీర్ లో ఇది అతడికి 19వ చిత్రం. రేపు ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకానుంది. ఈ మేరకు ప్రీ లుక్ రిలీజ్ చేశారు.

ప్రీ లుక్ పోస్టర్‌లో చేతిలో ఉన్న పేపర్ కట్స్ ని చూపిస్తూ "అన్ని అడ్డంకులకు అడ్డంగా ఒకడు నిల్చున్నాడు" అనే స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలుగు దినపత్రికల నుంచి వివిధ ఆర్టికల్స్ ఉన్న వైనాన్ని గమనించవచ్చు. ప్రీ లుక్ పోస్టర్ క్యూరియాసిటీని కలిగిస్తోంది.

రేపు ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు పొలిటికల్ గా కూడా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు నారా రోహిత్. అతడి సెకెండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News