Nara Rohit | మరో సినిమా రెడీ చేసిన నారా రోహిత్

Nara Rohit - ఓవైపు ప్రతినిధి-2 సినిమా చేస్తూనే, మరోవైపు ఇంకో సినిమాను రెడీ చేశాడు నారా రోహిత్.

Advertisement
Update: 2024-04-17 17:15 GMT

హీరో నారా రోహిత్ 20వ చిత్రం “సుందరకాండ”. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ను పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది.

నారా రోహిత్ కూల్ అండ్ క్లాసీ లుక్ లో చేతిలో పూలకుండీతో, మరో చేతిలో పుస్తకంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమా జానర్ ఏంటనేది చెప్పారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. ఇది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకి రానుంది.

వృతి వాఘని హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ప్రతినిథి-2 ప్రచారంలో బిజీగా ఉన్నాడు నారా రోహిత్. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన వెంటనే సుందరకాండ ప్రమోషన్స్ మొదలవుతాయి. 

Tags:    
Advertisement

Similar News