Nani | బలగం దర్శకుడితో నాని సినిమా

Nani - బలగం దర్శకుడు వేణుపై ఇప్పటికే ప్రశంసలు కురిపించాడు నాని. ఇప్పుడీ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు.

Advertisement
Update: 2024-01-05 17:07 GMT

'బలగం'తో అందరినీ ఆశ్చర్యపరిచాడు జబర్దస్త్ వేణు. ఇది 2023 ఉత్తమ చిత్రాలలో ఒకటి. అంతేకాదు, టాలీవుడ్ లో క్లాసిక్ అనిపించుకుంది. బాక్సాఫీస్ విజయాన్ని కూడా అందుకుంది. ఇంతే కాకుండా, ఈ చిత్రం వందకు పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఈ ఒక్క సినిమాతో వేణు ఇమేజ్ మారిపోయింది, కమెడియన్ స్థాయి నుంచి అందరూ గౌరవించే స్థాయికి ఎదిగాడు వేణు.

బలగం విజయం తర్వాత వేణు తన రెండో సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈసారి కూడా దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చేస్తున్నాడు. అతని వద్ద ఒక స్క్రిప్ట్ ఉంది. దాన్ని నానికి వినిపించాడు. నాని కూడా ఈ కాన్సెప్ట్ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

వేణుతో వర్క్ చేయాలని ఉందంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు నాని. తాజాగా కూడా మరోసారి తన మనసులో మాటను బయటపెట్టాడు. హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా నాని ఈ విషయం వెల్లడించాడు.

నాని చెబుతున్న ప్రకారం చూసుకుంటే, త్వరలోనే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బలగం లాంటి క్లాసిక్ తర్వాత, రెండో సినిమాకు వేణు ఎలాంటి కథను ఎంచుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News