Naa Saami Ranga | నా సామిరంగ మొదటి రోజు వసూళ్లు

Naa Saami Ranga Day-1 Collections - నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాకు మొదటి రోజు డీసెంట్ వసూళ్లు వచ్చాయి.

Advertisement
Update: 2024-01-15 11:28 GMT

సంక్రాంతి బరిలో చివరిగా రిలీజైన సినిమా నా సామిరంగ. నిన్న రిలీజైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్లు దొరికాయి. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ హనుమాన్, గుంటూరుకారం, సైంధవ్ సినిమాలు మార్కెట్లో ఉన్నాయి.

అలా తక్కువ థియేటర్లలో రిలీజైనప్పటికీ, మంచి వసూళ్లు సాధించింది నా సామిరంగ సినిమా. తొలి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 8.6 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

థియేటర్లు తక్కువగానే దొరికినప్పటికీ ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే, సంక్రాంతి వల్ల దాదాపు అన్ని థియేటర్లు హౌజ్ ఫుల్స్ నడిచాయి. ఫలితంగా నా సామిరంగ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

ఈ సందర్భంగా ఓ సెంటిమెంట్ బయటపెట్టారు నాగ్. ప్రతి పండక్కి తనే చివర్లో వస్తానని, కానీ తనే సంక్రాంతి విజేతగా నిలిచానని గుర్తుచేసుకున్నారు. సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాల విషయంలో అదే జరిగిందని, ఇప్పుడు నా సామిరంగ విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు.

నా సామిరంగ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే, సైంధవ్, గుంటూరుకారం సినిమాలకు కూడా మిక్స్ డ్ టాక్ వచ్చేసింది. దీంతో ఏమాత్రం మౌత్ టాక్ బాగున్నా, నాగ్ సినిమా కోలుకునే అవకాశాలున్నాయి. 




Tags:    
Advertisement

Similar News