Thandel | తండేల్ షూటింగ్ అప్ డేట్స్

Thandel Movie - నాగచైతన్య తాజా చిత్రం తండేల్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం..

Advertisement
Update: 2024-02-05 16:51 GMT

నాగ చైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో వస్తున్న సినిమా 'తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో భారీ బడ్జెట్ తో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర యూనిట్ కీలకమైన భారీ షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, సాయి పల్లవి, ఇతర తారాగణంపై సినిమాలోని చాలా కీలకమైన సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ మేరకు వర్కింగ్ స్టిల్స్ ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ చూస్తే అది అర్ధమౌతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి చాలా సహజసిద్ధంగా, తక్కువ మేకప్ తో కనిపిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం సహజసిద్ధమైన లోకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'తండేల్' ప్రమోషనల్ కంటెంట్ సంచలనం సృష్టించింది. చిత్రంలో రాజు అనే జాలరి పాత్రలో నాగచైతన్య నటిస్తుండగా, అతని మనసుని గెలుచుకున్న అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తోంది. నాగ చైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ మెస్మరైజింగ్ గా ఉంటుందట.

యదార్థ సంఘటనల కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెలలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.







Tags:    
Advertisement

Similar News