Thandel Movie | ఘనంగా మొదలైన నాగచైతన్య 'తండేల్'

Thandel Movie - నాగచైతన్య హీరోగా తండేల్ సినిమా రాబోతోంది. ఈ సినిమాను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు.

Advertisement
Update: 2023-12-09 15:28 GMT

నాగచైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ 'తండేల్'. నాగచైతన్య కు హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన 'తండేల్' తాజాగా గ్రాండ్ గా లాంఛ్ అయింది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌, ఈ పూజా కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. తండేల్ ప్రయత్నాన్ని ఏడాదిన్నర కిందట మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు నిర్మాత అల్లు అరవింద్. హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనేదానిపై ప్రత్యేక దృష్టిపెట్టారని... ఈ కథతో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్తారని అంటున్నారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. "ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూ వస్తున్నాం. ప్రీప్రొడక్షన్ లో ప్రతి అడుగుని చాలా ఎంజాయ్ చేశాను. శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం, చందూ, నేను కథ పై చర్చించడం, శ్రీకాకుళం యాసపై వర్క్ అవుట్ చేయడం ఇలా చాలా విషయాలపై ప్రత్యేకంగా పని చేశాం. ఏ సినిమాకి ఇంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రోసస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను." అంటూ చెప్పుకొచ్చాడు.

డిసెంబర్ 15 తర్వాత తండేల్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఇస్తూనే, ఏకథాటిగా షెడ్యూల్ ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News