NagaChaitanya: యాక్షన్ మోడ్ లోకి ఎంటరైన నాగచైతన్య

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి యాక్షన్ పార్ట్ షూట్ మొదలైంది.

Advertisement
Update: 2022-11-12 03:51 GMT

నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు-తమిళ భాషల్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నాగచైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది.

ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించి హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్‌లో భారీ సెట్‌ వేశారు. అరవింద్ స్వామి టీమ్‌లో చేరాడు. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని మహేష్ మాథ్యూ మాస్టర్ పర్యవేక్షిస్తున్నాడు.

కృతి శెట్టి, శరత్‌కుమార్, సంపత్ రాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 2 భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది ఈ సినిమా.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నాగ చైతన్యకు మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రానికి తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News