Nabha Natesh - మరోసారి టాలెంట్ చూపించిన బ్యూటీ

Nabha Natesh painting - నభా నటేష్ తన పెయింటింగ్ టాలెంట్ చూపించింది. చార్లీ చాప్లిన్ పెయింటింగ్ ను అద్భుతంగా గీసింది

Advertisement
Update: 2023-05-30 11:57 GMT

నభా నటేష్ ఓ హీరోయిన్ గానే చాలామందికి తెలుసు. కానీ ఆమెలో మంచి పెయింటర్ ఉన్నాడనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. లాక్ డౌన్ టైమ్ లో చాలా పెయింటింగ్స్ గీసింది నభా నటేష్. తాజాగా మరోసారి తన టాలెంట్ చూపించింది.

ఈసారి చార్లీ చాప్లిన్ బొమ్మ గీసింది నభా. ప్రపంచం మెచ్చిన నటుడు చార్లీ చాప్లిన్ ను తన కాన్వాస్ పై ఆవిష్కరించి, అతడికి ఘనంగా నివాళులు అర్పించింది. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉన్న ఈ పెయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నభాను అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె పెయింటర్ అనే విషయం తెలిసినవాళ్లు ఆమెను పొగుడుతుంటే, నభా మంచి పెయింటర్ అనే విషయం తెలియని వాళ్లు చార్లీచాప్లిన్ పెయింటింగ్ చూసి షాక్ అవుతున్నారు. నిజంగా నువ్వే గీశావా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈమధ్య యాక్సిడెంట్ కు గురైంది నభా నటేష్. దీంతో సినిమాలకు దూరమైంది. ఇప్పుడు పూర్తిగా కోలుకొని, మరోసారి కెమెరా ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆమె నటించనున్న కొత్త సినిమాల వివరాలు బయటకు రాబోతున్నాయి.




Tags:    
Advertisement

Similar News