Naa Saami Ranga | వారం రోజులు పూర్తిచేసుకున్న నాగ్ సినిమా

Naa Saami Ranga First Week Collections - నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ, మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ సినిమా తాజా వసూళ్లు చూద్దాం...

Advertisement
Update: 2024-01-21 17:40 GMT

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన నా సామిరంగ సినిమా తాజాగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఈ వారం రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు.

7వ రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కోటి 11 లక్షల షేర్ వచ్చింది. ఓవరాల్ గా ఈ వారం రోజుల్లో 20.54 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ నుంచి అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ.41.3 కోట్ల గ్రాస్ ని రాబట్టి అదరగొట్టింది. ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి బరిలో సక్సెస్ అందుకున్నారు నాగ్.

ఇంతకుముందు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు సంక్రాంతికే వచ్చి పెద్ద హిట్టయ్యాయి. ఇప్పుడు నా సామిరంగ కూడా అదే విధంగా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. దీంతో నాగార్జునకు సంక్రాంతి మరింత సెంటిమెంట్ గా మారింది.

కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కింది నా సామిరంగ. అతడికిదే తొలి సినిమా. అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించింది. మలయాళ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. పాటలు పెద్దగా క్లిక్ అవ్వనప్పటికీ, సినిమా సక్సెస్ అయింది.

Tags:    
Advertisement

Similar News