Naa Saami Ranga | నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఎలా ఉందంటే?

Naa Saami Ranga - నాగార్జున నటిస్తున్న సినిమా నా సామిరంగ. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update: 2023-12-10 15:34 GMT

కింగ్ నాగార్జున సంక్రాంతి మూవీ ‘నా సామిరంగ’. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పండుగకు గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న నాగార్జున, విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది.

ఆస్కార్ అవార్డ్- విన్నింగ్ కంపోజర్ కీరవాణి, ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ కలిసి నా సామిరంగ సినిమాకు వర్క్ చేస్తున్నారు. మొదటి సింగిల్ 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది' పాట విడుదలతో మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి.

కీరవాణి మార్క్ మ్యూజిక్ కనిపించింది పాటలో. రామ్ మిరియాల తన వాయిస్ తో పాటకు ఓ కొత్త ఫీల్ తీసుకొచ్చాడు. పాటలో నాగార్జున, ఆషికా రంగనాథ్‌ల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే నాగార్జున తన హ్యాండ్సమ్ లుక్స్‌తో ఎట్రాక్ట్ చేయగా.. ఆషికా సాంప్రదాయక గెటప్‌లో ఆకట్టుకుంది. పాటలో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి.

2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించాడు. దర్శకుడు కరుణకుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Full View

Tags:    
Advertisement

Similar News