Murugadas | మురుగదాస్ సినిమాలో మోహన్ లాల్

Mohan Lal Murugadas - కెరీర్ లో తొలిసారి మోహన్ లాల్ తో కలిసి వర్క్ చేయబోతున్నాడు దర్శకుడు మురుగదాస్. ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్.

Advertisement
Update: 2023-11-16 16:08 GMT

ఏఆర్ మురుగదాస్ ఒకప్పుడు అగ్ర సౌత్ ఇండియన్ డైరెక్టర్. కోలీవుడ్-టాలీవుడ్‌లోని ప్రతి స్టార్ హీరో అతడితో పనిచేయాలని కోరుకున్నారు. అయితే ఆ తర్వాత వరుసగా ఫ్లాపులిచ్చాడు ఈ దర్శకుడు. దీంతో కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో బలమైన పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు మురుగ. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా పరాజయం తర్వాత ఆయన సినిమాలేవీ చేయలేదు.

లాంగ్ గ్యాప్ తర్వాత, ఎట్టకేలకు శివ కార్తికేయన్ హీరోగా సినిమా చేస్తున్నాడు మురుగదాస్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్, లొకేషన్లు ఖరారు చేసే పనిలో ఉన్నాడు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర కోసం మల్లూవుడ్ లెజెండ్ మోహన్‌లాల్‌ను తీసుకున్నారు.

మోహన్ లాల్ రాకతో, ఈ ప్రాజెక్టుకు వెయిట్ పెరిగింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుంది. విలన్ గా విద్యుత్ జమ్వాల్ కనిపించనున్నాడు. ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీలో విలన్ గా కనిపించాడు విద్యుత్.

శ్రీ లక్ష్మి మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.

Tags:    
Advertisement

Similar News