Kannappa Movie | కన్నప్పలో మరో రెండు ఎట్రాక్షన్స్

Kannappa - మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప ప్రాజెక్టులోకి మరో ఇద్దరు వచ్చి చేరారు. ఈసారి మోహన్ బాబు, శరత్ కుమార్ వంతు.

Advertisement
Update: 2023-11-09 16:19 GMT

మంచు విష్ణు కలల ప్రాజెక్టు కన్నప్ప. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి విలక్షణ నటుడు శరత్ కుమార్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా వచ్చారు.

దక్షిణాదిలో శరత్ కుమార్‌కు హీరోగా, నటుడిగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. హీరోగా, ప్రముఖ పాత్రల్లో ఎంతో విలక్షణంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న శరత్ కుమార్ ఇప్పుడు కన్నప్ప చిత్రంలో నటించేందుకు సిద్దమయ్యారు. కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూ వస్తున్న శరత్ కుమార్ ఈసారి అందరినీ ఆశ్చర్యపర్చబోతున్నారు.

ఇక మోహన్ బాబు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. మంచు విష్ణు సినిమాలో ఆయన తప్పకుండా ఉంటారనే అంచనాల్ని నిజం చేస్తూ, ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరారు. ఈ ఇద్దరూ కన్నప్ప సెట్స్ మీదకు రావడంతో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.

శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. సినిమా 80 శాతం షూటింగ్ ను న్యూజిలాండ్ లో పూర్తి చేస్తారు. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News