MM Keeravani | ఆస్కార్ ట్యాగ్ లైన్ సినిమాకు పనికిరాదు

MM Keeravani: నా సామిరంగ సినిమాకు సంగీతం అందించారు కీరవాణి. తనకు ఆస్కార్ రావడం వల్ల నా సామిరంగ సినిమాకు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారాయన.

Advertisement
Update: 2024-01-08 17:17 GMT

MM Keeravani: "మీరు చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటారు.. ఇలాంటి సమయంలో నా సామిరంగ ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా వస్తోంది కదా.. ? ఆస్కార్ తో వచ్చిన హైప్ వల్ల ‘నా సామిరంగా’ పై దాని ప్రభావం ఎలా ఉంటుంది?"

నా సామిరంగ సినిమాకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణికి ఎదురైన సూటి ప్రశ్న ఇది. దీనికి ఆయన అంతే సూటిగా సమాధానం ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్ అనేది సినిమా సక్సెస్ కు పనికిరాదనేది ఆయన మాట.

"నేను మొదటి నుంచి సెలక్టివ్ గానే సినిమాలు చేస్తున్నాను. దీనిని అందరూ అంగీకరిస్తారు. ఒక సినిమాకి హైప్ అనేది రిలీజ్ అయ్యే పాటల ద్వారా వస్తుంది. ఆస్కార్ అనేది ఒక సినిమా సక్సెస్ కి కొంచెం కూడా పని చేయదని భావిస్తాను. నా వరకూ బాగా వర్క్ చేయాలి. డైరెక్టర్ బాగా తీయాలి. అది జనాలకి కనెక్ట్ కావాలి. అంతే తప్ప, నాకు ఆస్కార్ వచ్చిందని, సినిమా ఆడదు."

హీరో నాగార్జునతో పని చేయడం తనకు బాగా అలవాటైన విద్య అంటున్నారు కీరవాణి. తమ కాంబినేషన్ చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయిందని, నా సామిరంగ కూడా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 14వ తేదీన థియేటర్లలోకి వస్తోంది నా సామిరంగ.

Tags:    
Advertisement

Similar News