Mission Chapter 1 | సంక్రాంతి బరిలో మరో తమిళ సినిమా

Mission Chapter 1 - సంక్రాంతికి ఇప్పటికే కెప్టెన్ మిల్లర్, లాల్ సలామ్ లాంటి డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మరో మూవీ రెడీ అయింది.

Advertisement
Update: 2023-12-25 10:11 GMT

లైకా ప్రొడక్షన్స్ మరో సినిమా రెడీ చేసింది. ‘మిషన్ చాప్టర్ 1’ మూవీ విడుదలకు సిద్ధమైంది. అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, నిమిషా సజయన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడీ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఈ సంక్రాంతికి మిషన్ ఛాప్టర్ 1 ను విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించారు. నిజానికి ఇది సంక్రాంతి టార్గెట్ ను అందుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ దర్శకుడు విజయ్, శరవేగంగా ఈ సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి సిద్ధం చేశాడు.

2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ‘మిషన్ చాప్టర్ 1’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె జైలర్ పాత్రలో మెప్పించబోతోంది. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాను 4 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

సంక్రాంతికి ఇప్పటికే సౌత్ లో గట్టి పోటీ ఉంది. తెలుగులో మహేష్, నాగార్జున లాంటి హీరోల సినిమాలు వస్తున్నాయి. అటు తమిళ్ లో రజనీకాంత్ సినిమా పోటీలో ఉంది. అయినప్పటికీ మిషన్ ఛాప్టర్-1ను సిద్ధం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News