Miss Perfect | రొమాంటిక్ కామెడీ అంట

Miss Perfect - లావణ్య త్రిపాఠి చేసిన వెబ్ సిరీస్ మిస్ పెర్ ఫెక్ట్. ఇదొక రొమాంటిక్ కామెడీ అంటున్నాడు హీరో అభిజీత్.

Advertisement
Update: 2024-02-02 16:11 GMT

బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ నటించిన వెబ్ సిరీస్ "మిస్ పర్ఫెక్ట్". ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటించింది. అభిజ్ఞ మరో కీ-రోల్ చేసింది. "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో "మిస్ పర్ఫెక్ట్" తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా ఈ సిరీస్ హైలైట్స్ వివరించాడు హీరో అభిజీత్.

"మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో నేను రోహిత్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. చాలా లేజీ పర్సన్ గా కనిపిస్తా. జీవితంలో ఎలాంటి లక్ష్యమంటూ ఉండదు. ఏదో డబ్బు కోసం ఉద్యోగం చేస్తుంటాడు గానీ అదీ సీరియస్ గా తీసుకోడు. రోహిత్ కు ఇష్టమైన విషయం ఒక్కటే వంట చేయడం. అది మాత్రం శ్రద్ధగా చేస్తుంటాడు. నా రియల్ లైఫ్ లో రోహిత్ లాంటి క్యారెక్టర్స్ ను చాలామందిని చూశాను. నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్లు ఉన్నారు. ఉద్యోగంలో ఇష్టంతో ఉండలేక...బయటకు వచ్చి బిజినెస్ తో రిస్క్ చేయలేక ఆ సంఘర్షణలో ఉండిపోతారు. ఎవరైనా ఉద్యోగం కాదని వేరే పనిచేయాలనుకుంటే అది 30-35 ఇయర్స్ లోనే చేయాలి. 40 దాటిన తర్వాత మీరు రిస్క్ చేయాలన్నా చేయలేరు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరిగిపోతాయి."

లావణ్య త్రిపాఠీ నటన అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉందంటున్నాడు. తమ మధ్య చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయని... ఈ సీన్స్ చేసే క్రమంలో మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెబుతున్నాడు.

Tags:    
Advertisement

Similar News