Guntur Kaaram | మహేష్ మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్

Guntur Kaaram - మహేష్-శ్రీలీల మాస్ స్టెప్పులతో గుంటూరుకారం నుంచి సాంగ్ రిలీజైంది. తమన్ ఈ పాటకు కంపోజర్.

Advertisement
Update: 2023-12-31 17:14 GMT

మహేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరుకారం. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీంతో గుంటూరు కారంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

చిత్ర బృందం ఇప్పటికే దమ్ మసాలా, హే బేబీ అనే 2 పాటలను, అలాగే మునుపెన్నడూ లేని విధంగా మహేష్ బాబు యొక్క మాస్ అవతార్ ను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేసింది. సంక్రాంతి పండుగకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇప్పుడు మూడో పాటగా హై వోల్టేజ్‌ మాస్‌ నంబర్‌ "కుర్చీ మడతపెట్టి"ని విడుదల చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను మరింత మాస్‌గా, ఎనర్జిటిక్‌గా చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఈ పాటను విడుదల చేసింది.

ఈ పాటలో అదిరిపోయే బీట్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో మనం వినే జానపద శైలి సాహిత్యం ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. శ్రీలీల-మహేష్ డాన్స్ ఈ సాంగ్ లో హైలెట్ కానుంది. తమన్ సంగీతం అందించాడు.

Full View

Tags:    
Advertisement

Similar News