Manjummel Boys | మంజుమ్మల్ బాయ్స్ తెలుగు ట్రయిలర్ చూశారా?

Manjummel Boys - మలయాళంలో ఇండస్ట్రీ హిట్ సాధించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులోకి వస్తోంది. తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2024-04-01 16:52 GMT

మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ 'మంజుమ్మల్ బాయ్స్'. మలయాళంలో ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కళ్లముందే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది. రిలీజైన వారంలోనే 50 కోట్లు కొల్లగొట్టింది.

మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను అందిస్తోంది. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

హ్యాపీ-గో-లక్కీ యంగ్ ఫ్రెండ్స్ బ్యాచ్ తమిళనాడులోని కొడైకెనాల్‌కు డ్రీం టూర్ కి వెళ్తారు. వారు హిల్ స్టేషన్ తో పాటు కమల్ హాసన్ 'గుణ' చిత్రీకరించబడిన డెవిల్స్ కిచెన్ అని పిలువబడే గుణ కేవ్స్ ను ఎక్స్ ఫ్లోర్ చేస్తారు. దురదృష్టవశాత్తు, స్నేహితుల్లో ఒకరు గుహలోని లోతైన గుంటలలో ఒకదానిలో పడిపోతాడు, మిగతా వారు భయాందోళనలకు గురౌతారు. మిగతావాళ్లంతా కలిసి, ఆ వ్యక్తిని ఎలా రక్షించారనేది స్టోరీ.

యదార్థంగా జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ ఓపెనింగ్ పార్ట్స్ బ్యాచ్ స్నేహాన్ని చూపిస్తే, చివరి సగం భావోద్వేగాలు, థ్రిల్స్‌ కనిపించాయి. తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.

Full View

Tags:    
Advertisement

Similar News