Mangalavaram Movie: మంగళవారం మూవీ షూటింగ్ అప్ డేట్స్

Mangalavaram Movie: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది మంగళవారం సినిమా. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

Advertisement
Update: 2023-06-14 16:28 GMT

Mangalavaram Movie: మంగళవారం మూవీ షూటింగ్ అప్ డేట్స్

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' వంటి కల్ట్ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

జూన్ 12వ తేదీన తీసిన షాట్ తో ఈ సినిమా టోటల్ షెడ్యూల్ పూర్తయింది. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టింది. అందులో 48 రోజులు పగటి పూట షూటింగ్ చేయగా.. 51 రోజులు రాత్రి వేళల్లో చిత్రీకరణ చేశారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ లో ఈ సినిమా వస్తోంది.

త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల తేదీల్ని ప్రకటిస్తారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన పాయల్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాయల్ ను వెనక నుంచి నగ్నంగా చూపించడం చాలామందిని ఆకట్టుకుంది.

గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ అంటున్నాడు దర్శకుడు. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మూవీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అంటున్నాడు అజయ్ భూపతి.

Tags:    
Advertisement

Similar News