Mangalavaaram | మంగళవారం వేడి మొదలైంది

Mangalavaaram Movie: అజయ్ భూపతి తీసిన మంగళవారం సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సినిమాకు A-సర్టిఫికేట్ వచ్చింది.

Advertisement
Update: 2023-11-15 16:13 GMT

మంగళవారం సినిమా సందడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఆర్ఎక్స్ 100 ఫేమ్ ఫేమ్ అజయ్ భూపతి రూపొందించిన గ్రామీణ థ్రిల్లర్, ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. నవంబర్ 17 నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవరం సెన్సార్ రిపోర్ట్ మరియు రన్ టైమ్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ చిత్రం A-సర్టిఫికేట్‌తో సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. దాని రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలుంది. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే మిస్టీరియస్ థ్రిల్లర్ అని, ఊహించని మలుపులు, థియేటర్‌లో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయని యూనిట్ చెబుతోంది.

సినిమాకు A-సర్టిఫికేట్‌ రావడంతో, ఇందులో అడల్ట్ సన్నివేశాలు ఉంటాయని అనుకోవద్దంటోంది యూనిట్. కొన్ని సన్నివేశాల్ని అత్యంత సహజంగా తీయడం వల్ల A-సర్టిఫికేట్‌ వచ్చిందని, అడల్ట్ సన్నివేశాలు మాత్రం ఉండవని చెబుతోంది.

మంగళవరం ప్రీ-రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రం 13 కోట్ల రూపాయల భారీ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇది చాలా పెద్ద ఎమౌంట్. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా పెద్ద డీల్ తో క్లోజ్ అయింది. సినిమాపై ఉన్న క్రేజ్, బిజినెస్ కు కలిసొచ్చింది.

పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్ తదితరులు నటించిన మంగళవరం ఈ వారం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై పాయల్, అజయ్ భూపతి చాలా హోప్స్ పెట్టుకున్నారు.

Tags:    
Advertisement

Similar News