Manchu Vishnu - మంచు విష్ణుకు గాయాలు

Manchu Vishnu - కన్నప్ప సినిమా షూటింగ్ టైమ్ లో మంచు విష్ణు గాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

Advertisement
Update: 2023-10-29 15:13 GMT

కన్నప్ప షూటింగ్‌లో హీరో మంచు విష్ణు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హీరో ప్రస్తుతం కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్‌లో పాల్గొంటున్న అతను యాక్షన్ సీక్వెన్స్‌లో గాయపడ్డాడు. అయితే, చిత్ర బృందం నుండి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

తెలుగు సినీ ప్రేమికులు, పాతతరం వారు భక్త కన్నప్ప అనే క్లాసిక్ భక్తిరస చిత్రాన్ని మరిచిపోరు. ఇప్పుడా సినిమాను రీమేక్ చేస్తున్నాడు మంచు విష్ణు. ఇటీవలే అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే సంగీతం అందించనుండగా, షెల్డన్ షా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.

సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లోనే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ ను డ్రోన్స్ సహాయంతో షూట్ చేస్తున్నారు. షూటింగ్ టైమ్ లో ప్రమాదవశాత్తూ ఓ డ్రోన్ కుప్పకూలిందంట. దీంతో మంచు విష్ణుకు గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే అతడ్ని సమీపంలోని హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు సమాచారం.

ఈ సినిమాతో చాలామంది స్టార్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, మోహన్‌లాల్‌, నయనతారతో పాటు పలువురు తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News