Mama Mascheendra | ఆ సినిమా కూడా దసరా రిలీజ్

Mama Mascheendra - మొన్ననే థియేటర్లలోకి వచ్చింది మామా మశ్చీంద్ర సినిమా. అంతలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Advertisement
Update: 2023-10-09 02:08 GMT

దసరా బరిలో 3 సినిమాలు నిలిచాయి. బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు, విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలు దసరాకు రాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందనే బెట్టింగ్ జోరుగా సాగుతున్న టైమ్ ఇది. ఇలాంటి టైమ్ లో దసరాకు మరో సినిమా షెడ్యూల్ అయింది. అదే మామా మశ్చీంద్ర

అదేంటి.. మామా మశ్చీంద్ర సినిమా ఆల్రెడీ రిలీజైంది కదా, పైగా ఫ్లాప్ కూడా అయింది. మరి దసరా బరిలో ఎలా నిలుస్తుంది? అక్కడికే వస్తున్నాం. సుధీర్ బాబు హీరోగా నటించిన మామా మశ్చీంద్ర సినిమాను దసరాకు ఓటీటీలో స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా.

హర్షవర్థన్ దర్శకత్వంలో తెరకెక్కింది మామా మశ్చీంద్ర సినిమా. సుధీర్ బాబు ఇందులో త్రిపాత్రాభినయం చేశాడు. అయితే రిలీజైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. మూడో రోజుకు చాలా సెంటర్లలో జీరో ఆక్యుపెన్సీ కనిపించింది. లెక్కలేనన్ని చోట్ల షోలు కూడా రద్దు చేశారు.

దీంతో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్టు మూడో రోజుకే ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో దసరా కానుకగా, 20వ తేదీ నుంచి మామా మశ్చీంద్ర స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ పండక్కి ప్రైమ్ కానుక ఇదేనంటూ ప్రచారం సాగుతోంది. అలా విడుదలైన 15 రోజులకే మామా మశ్చీంద్ర సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఓ సౌలభ్యం ఉంది. రాసుకున్న అగ్రిమెంట్ కంటే ముందే ఓ సినిమాను స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తే, డబ్బులు ఇంకాస్త ఎక్కువ ఇస్తారు. ఎలాగూ థియేటర్లలో ఫ్లాప్ అయింది కాబట్టి, కనీసం నాన్-థియేట్రికల్ గా నైనా కోలుకుందామనే ఉద్దేశంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. తాజా ప్రకటనతో, ఇక ఈ సినిమా చూడ్డానికి ఎవ్వరూ థియేటర్లకు వెళ్లరు. మరో 10 రోజులాగితే ఎలాగూ ఓటీటీలోకి వస్తుంది కాబట్టి, థియేటర్లలో చూద్దామనుకునేవాళ్లు కూడా డ్రాప్ అవుతారు.

Tags:    
Advertisement

Similar News