Guntur Kaaram | హమ్మయ్య ఓ పని పూర్తయింది

Guntur Kaaram - మహేష్ గుంటూరుకారం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి.

Advertisement
Update: 2023-12-28 17:12 GMT

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరుకారం. ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రహసనం పూర్తయింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ముగిసింది. సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. అప్పుడెప్పుడో ఏడాదిన్నర కిందట మొదలైన ఈ సినిమా, ఈరోజు పూర్తయింది.

ఆది నుంచి గుంటూరు కారం సినిమా షూటింగ్ పడుతూలేస్తూ సాగింది. మధ్యలో ఓ 2-3 సార్లు షూటింగ్ కూడా ఆగిపోయింది. ఎందుకైనా మంచిదని టాకీతో మొదలుపెట్టి, ముందు అది పూర్తిచేశారు. ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటించారు.

విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ప్యాచ్ వర్క్ తో పాటు, సాంగ్స్ షూట్ స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు తప్పలేదు. మాంటేజ్ సాంగ్ కు భారీ తారాగణం కావాల్సి వచ్చింది. అప్పటికే షెడ్యూల్స్ లేట్ అవ్వడంతో, కాల్షీట్లు సెట్ కాలేదు.

మొత్తానికి ఎలాగోలా అన్ని షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. చివరగా మహేష్-శ్రీలీల పై ఓ మంచి మాస్ సాంగ్ షూట్ చేశారు. ఈ షూట్ ఇలా పూర్తిచేసి, అలా విదేశాలకు వెళ్లాడు మహేష్. కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయబోతున్నాడు. ఇటు యూనిట్ మాత్రం జనవరి 12న టార్గెట్ ను అందుకోవడం కోసం కష్టపడుతోంది. 

Tags:    
Advertisement

Similar News