Guntur Kaaram | మహేష్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Guntur Kaaram 1st Weekend Collection - గుంటూరుకారం మొదటి వారాంతం పూర్తి చేసుకుంది. ఈ 3 రోజుల్లో సినిమాకు వచ్చిన వసూళ్లు చూద్దాం

Advertisement
Update: 2024-01-15 11:03 GMT

గుంటూరు కారం మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 76.64 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలలో 2వ రోజు కంటే 3వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అయితే నైజాంలో మాత్రం 3వ రోజు నుంచి సినిమా దాదాపు 20శాతం పడిపోయింది.

ఓవరాల్‌గా ఈ చిత్రం మొదటి రోజు నుండి నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ మొదటి 3 రోజులు మంచి నంబర్స్ వచ్చాయి. ఫ్యామిలీస్‌లో, పండగ సెలవుల్లో మహేష్‌బాబు బ్రాండ్‌తో సినిమాకు మంచి నంబర్లు తీసుకొచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ 135 కోట్లు కాగా, సినిమా 3 రోజుల్లో 56 శాతం రికవరీ అయింది. మరో 3 రోజుల పాటు ఇదే జోరును ఈ సినిమా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వీక్ ముగిసేనాటికి ఈ సినిమాకు 100 కోట్ల షేర్ వస్తుందని భావిస్తున్నారు. అయితే బడ్జెట్ పరంగా చూసుకుంటే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అంటోంది ట్రేడ్.

మొదటి 3 రోజుల వసూళ్లు చూసుకుంటే, నైజాంలో గుంటూరుకారంకు 25 కోట్లు, సీడెడ్ లో 6.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయల షేర్లు వచ్చాయి. 

Tags:    
Advertisement

Similar News