Maa Nanna Superhero | మరో సినిమా పూర్తిచేసిన సుధీర్ బాబు

Maa Nanna Superhero - సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మరో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ చేస్తారు.

Advertisement
Update: 2023-09-07 04:19 GMT

సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి (లూజర్ సిరీస్ ఫేమ్) దర్శకత్వంలో చేస్తున్న విలక్షణ చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌ పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో ఉన్న సెల్ఫీస్, వీడియోను హీరో సుధీర్ బాబు తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేశాడు.

మా నాన్న సూపర్ హీరో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించనున్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే మామా మశ్చీంద్రను విడుదలకు సిద్ధం చేశాడు సుధీర్ బాబు. అక్టోబర్ 6న ఆ సినిమా విడుదలకానుంది. ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన మినిమం గ్యాప్ లో మా నాన్న సూపర్ హీరో సినిమా రిలీజ్ అవుతోంది. ఈ గ్యాప్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News