Koratala Siva: లొకేషన్ వేటలో కొరటాల శివ

Jr NTR and Koratala Siva Movie: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా కోసం లొకేషన్ వేట మొదలైంది. సినిమాటోగ్రాఫర్ తో కలిసి కొరటాల లొకేషన్ రెక్కీకి వెళ్లారు

Advertisement
Update: 2022-11-10 06:30 GMT

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగిపోయిందంటూ ప్రచారం జరిగిన ఈ మూవీపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. కెమెరామెన్ రత్నవేలు, ఆర్ట్ డైరక్టర్ సాబు శిరిల్ తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చాడు కొరటాల. ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించి రత్నవేలుతో కలిసి లొకేషన్ వేట మొదలుపెట్టాడు. ఇదేదో విదేశాల్లో లొకేషన్ల వేట కాదు. ఇండియాలోనే తమ కథకు సరిపోయే లొకేషన్ల కోసం వెదుకుతున్నాడు కొరటాల.

ఎన్టీఆర్, కొరటాల సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ ఇండియాలోనే జరుగుతుంది. కాకపోతే పాన్ ఇండియా కథ కావడంతో, వివిధ రాష్ట్రాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటి సమయం, సందర్భం బట్టి పాటల షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తారు. లేదంటే టోటల్ షూటింగ్ ఇండియాలోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కథకు అవసరం లేదనుకుంటే ఏదీ టచ్ చేయడు కొరటాల. ఫారిన్ లొకేషన్లు కూడా అందులో భాగమే. కాబట్టి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పూర్తిగా ఇండియాలోనే జరిగే అవకాశం ఉంది. పాటల కోసం సెట్స్ వేస్తారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News