Nithin, Krithi Shetty Movie: మరోసారి కలిసిన నితిన్-కృతి

Krithi Shetty Nithin - నితిన్, కృతి శెట్టి మరోసారి కలుస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వెంకీ కుడుముల సినిమాలో కృతి షెట్టి ఉంటుంది.

Advertisement
Update: 2023-06-06 12:01 GMT

నితిన్, కృతి శెట్టి కాంబినేషన్ కొత్తదేం కాదు. గతంలో వీళ్లిద్దరూ కలిసి మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి నితిన్ సినిమాలో నటించనుంది కృతి శెట్టి. అయితే మెయిన్ హీరోయిన్ గా మాత్రం కాదు.

నితిన్-రష్మిక కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన కాంబినేషన్ ఇది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి కృతి శెట్టి ఎంటర్ అయింది.

సినిమాలో రష్మిక పోషిస్తున్న హీరోయిన్ పాత్ర కాకుండా, మరో కీలకమైన పాత్ర ఉందట. దాని కోసం కృతి శెట్టిని తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ ప్రాజెక్టులో కృతి షెట్టిది సెకెండ్ హీరోయిన్ రోల్ అనుకోవచ్చు.

మరో నెల రోజుల్లో చనిపోతానని తెలుసుకున్న హీరో ఎలా ఫీల్ అయ్యాడు.. తన జీవిత ప్రయాణాన్ని ఎలా మార్చుకున్నాడు.. చుట్టూ ఉన్న జనం అతడిపై చూపించే సింపతీకి ఎలా రియాక్ట్ అయ్యాడు లాంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయనే ప్రచారం నడుస్తోంది. చూస్తుంటే.. ప్రభాస్ చేసిన చక్రం సినిమా పాయింట్ లానే ఉంది. కాకపోతే వెంకీ కుడుముల సినిమాలో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. తాజా చిత్రంలో కూడా అది పుష్కలంగా ఉంటుందంట.

Tags:    
Advertisement

Similar News