Prabhas Kriti Sanan: ప్రభాస్ తో ప్రేమ.. క్లారిటీ ఇచ్చిన భామ

Prabhas Kriti Sanan: ప్రభాస్ తో తను డేటింగ్ లో లేనని స్పష్టం చేసింది హీరోయిన్ కృతి సనన్. వరుణ్ ధావన్ మాటలు పట్టించుకోవద్దని చెబుతోంది.

Advertisement
Update: 2022-11-30 10:39 GMT

ప్రభాస్, కృతి సనన్ ప్రేమించుకుంటున్నారట. 2 రోజులుగా టాలీవుడ్ మీడియాలో మోత మోగిపోయింది ఈ వార్త. చాలామంది ఇది నిజమని నమ్మారు కూడా. ఎందుకంటే, ఇదేదో మీడియా సంస్థ నుంచి గాసిప్ లా పుట్టలేదు. స్వయంగా వరుణ్ ధావన్ అనే హీరో బయటపెట్టిన మ్యాటర్ ఇది. దీంతో ఇదంతా నిజమేనని అనుకున్నారు.

అలా 2 రోజులుగా హల్ చల్ చేస్తున్న ఈ మ్యాటర్ పై ఎట్టకేలకు హీరోయిన్ కృతి సనన్ స్పందించింది. వరుణ్ ధావన్ స్టేట్ మెంట్ లో నిజం లేదని కొట్టి పారేసింది.

ఓ రియాలిటీ షోలో కృతి సనన్ తో కలిసి పాల్గొన్న వరుణ్ ధావన్.. ప్రభాస్ మనసులో కృతి సనన్ పేరు ఉందని, ప్రస్తుతం అతడు దీపిక పదుకోన్ తో షూటింగ్ ఉన్నాడంటూ, ప్రభాస్ పేరు ప్రస్తావించకుండా స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీనిపై తాజాగా కృతి స్పందించింది.

వరుణ్ ధావన్ అత్యుత్సాహంలో ఏదో వాగేశాడని, అతడి మాటల్ని సీరియస్ గా తీసుకోవద్దని చెప్పింది. తను ప్రభాస్ తో డేటింగ్ చేయడం లేదని స్పష్టంచేసిన ఈ భామ, ఎవరో ఒకరు తన పెళ్లి తేదీ కూడా చెప్పేలా ఉన్నారని, అందుకే ఇలా ముందుగానే స్పందిస్తున్నానంటూ పోస్ట్ పెట్టింది.

కృతి సనన్ స్టేట్ మెంట్ తో ఈ డేటింగ్ వ్యవహారంపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ప్రభాస్-కృతి కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ వయసు 43 సంవత్సరాలు. ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Tags:    
Advertisement

Similar News