Ketika Sharma | బ్రో మూవీలో కీలక పాత్ర పోషించాను

Ketika Sharma BRO Movie - కేతిక శర్మ కెరీర్ లోనే బిగ్ మూవీ బ్రో. పవన్, సాయితేజ్ హీరోలుగా నచించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించానని చెబుతోంది ఈ బ్యూటీ.

Advertisement
Update: 2023-07-18 12:00 GMT

పవన్, సాయితేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. ఈ సినిమాలో పవన్ కు హీరోయిన్ లేదు. సాయిధరమ్ తేజ్ సరసన మాత్రం కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. తాజాగా సినిమాలో తన పాత్రకు సంబంధించి వివరాలు వెల్లడించింది ఈ బ్యూటీ.

"వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా వస్తోంది బ్రో. మాతృకతో పోలిస్తే ఇందులో నా పాత్రకు ప్రాధాన్యం ఎక్కువ. ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. స్క్రిప్ట్ చక్కగా కుదిరింది. దానికి తగ్గట్టుగా నటిగా నా ఉత్తమ ప్రదర్శనను ఇవ్వడానికి కృషి చేశాను. సముద్రఖని ఫాస్ట్ డైరెక్టర్. ఆయన ఎక్కువ టేక్స్ తీసుకోరు. తక్కువ టేక్స్ లోనే మన నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబడతారు. ఆయనకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. ఆయన చాలా తెలివైన దర్శకులు. ఇక త్రివిక్రమ్ అద్భుతమైన రచన కూడా ఈ సినిమాకి తోడైంది. కాబట్టి నేను ప్రత్యేకంగా హోం వర్క్ చేయాల్సిన అవసరం రాలేదు."

తాజాగా బ్రో సినిమా నుంచి జాణవులే అనే సాంగ్ రిలీజైంది. ఆ పాటలో చాలా స్టయిలిష్ గా కనిపించింది కేతిక. దానిపై కూడా ఆమె స్పందించింది.

"నీతా లుల్లా గారు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు. నా డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో ఆమెకే క్రెడిట్ దక్కుతుంది. జాణవులే పాట ఇచ్చిన అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను. అద్భుతమైన విదేశీ లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సాంగ్ ద్వారా మొదటిసారి నాకు డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో సంగీతం బాగుంటుంది."

తన కెరీర్ కు బ్రో సినిమాకు లింక్ పెట్టింది కేతిక. సరైన సక్సెస్ అందుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ, బ్రో సినిమా సక్సెస్ తర్వాత టాలీవుడ్ లో తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News