Keerthy Suresh | తెలుగు-తమిళ భాషల్లో కీర్తిసురేష్ కొత్త సినిమా

Keerthy Suresh - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై కొత్త సినిమా లాంచ్ చేసింది కీర్తిసురేష్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్.

Advertisement
Update: 2023-07-15 17:07 GMT

'ఒకే ఒక జీవితం', 'సుల్తాన్', 'ఖైదీ', 'ఖాకీ' వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాల అందించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తెలుగు-తమిళ ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్‌ ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు గణేష్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఫిమేల్ ఒరింయంటెడ్ కథ ఎక్సయిటింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్‌లు, టర్న్‌లు, అత్యుత్తమ సాంకేతికతతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వనుంది. కీర్తి సురేష్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులు, అభిమానులని అలరించనున్నారు.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు చెన్నైలో గ్రాండ్ గా జరిగాయి. కీర్తి సురేష్, నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు, దర్శకుడు గణేష్ రాజ్ తో పాటు ఇతర సాంకేతిక నిపుణులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత ఎస్‌ఆర్‌ప్రభు మాట్లాడుతూ.. "ఈ చిత్రం థ్రిల్లింగ్‌ కథనం, అత్యుత్తమ సాంకేతికతతో సరికొత్త అనుభూతిని ఇస్తూ అందరినీ అలరిస్తుంది" అని అన్నారు. సినిమా మొత్తం కీర్తిసురేష్ చుట్టూ తిరుగుతుంది. అలా అని ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ కాదంటోంది యూనిట్. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News