Keerthy Suresh | చిరంజీవి ఫ్రెండ్స్ లిస్ట్ లో చేరిన కీర్తిసురేష్

Keerthy Suresh - చిరంజీవి తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారని అంటోంది కీర్తిసురేష్. చిరుతో అనుబంధాన్ని షేర్ చేసుకుంది.

Advertisement
Update: 2023-08-06 15:36 GMT

భోళాశంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించింది కీర్తిసురేష్. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన చిరు, చిరంజీవితో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకుంది.

"చిరంజీవి గారితో అమ్మ పున్నమినాగు చిత్రంలో హీరోయిన్ గా నటించారు. అప్పటి విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, అలాగే సెట్ లో ఇచ్చిన సలహాలు సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్ గా చూసుకునేవారట. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లో వచ్చింది. అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవి గారితో నేను చెప్పినపుడు.. చిరంజీవి రియాక్షన్ నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. మీ అమ్మగారు ఇంతే చెప్పిందా .. నేను తనతో ఇంకా చాలా చెప్పాను అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి చిన్న విషయం ఆయనకి గుర్తుంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన ఇంత గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. స్మార్ట్ నువ్వు అని చిరంజీవి గారు నాతో అన్నారు."

సెట్స్ లో కీర్తిసురేష్ కు చిరంజీవి చాలా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారట. ఎలా చేస్తే బాగుంటుందో చెప్పేవారంట. అంతేకాదు, చిరంజీవి ఇంటి నుంచి రోజూ కీర్తిసురేష్ కు భోజనం కూడా వచ్చేదంట. చిరంజీవి, తను ఎప్పుడు కలిసినా భోజనం గురించి మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చింది.

11న థియేటర్లలోకి వస్తోంది భోళాశంకర్. మెహర్ రమేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా తమన్న నటించింది. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News