Keeravani - కోలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న మరకతమణి

Keeravani Kollywood re entry - కోలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు కీరవాణి. ఆయన రీఎంట్రీ ఇస్తున్న సినిమా డీటెయిల్స్ మీకోసం..

Advertisement
Update: 2023-06-03 13:59 GMT

‘జెంటిల్‌మన్' నిర్మాత కె.టి. కుంజుమోన్' సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ నిర్మాతలలో ఒకరు. కొన్ని హిట్ సినిమాలిచ్చారాయన. శరత్‌కుమార్‌, దర్శకుడు శంకర్‌ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది కూడా ఈయనే. గ్రాండ్ గా సినిమాలను నిర్మించడం, తన సినిమాలను ప్రమోట్ చేయడంలో ప్రత్యేకమైన శైలిని ఫాలో అవ్వడం ఆయన స్పెషాలిటీ.

లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడీ నిర్మాత 'జెంటిల్‌మన్ 2' సినిమాతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు కోసం ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణిని తీసుకున్నారు.

కోలీవుడ్ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసి చాలా రోజులైంది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఆస్కార్ అవార్డు విజేతను, తమిళ పరిశ్రమకు తీసుకొస్తున్నారు కుంజుమన్. జెంటిల్ మన్-2 సినిమా.. కీరవాణికి కోలీవుడ్ రీఎంట్రీ మూవీ.

ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్‌ను కీరవాణికి వినిపించడానికి దర్శకుడు గోకుల్ కృష్ణ హైదరాబాద్ వచ్చారు. కథకు చాలా ఇంప్రెస్ అయిన కీరవాణి, మ్యూజిక్ ఇవ్వడానికి అంగీకరించారు. అంతేకాదు, వచ్చే నెల నుంచి కంపోజింగ్ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News