Keeda Kola: నటీనటులెవరో చెప్పకుండా అప్పుడే రెండో షెడ్యూల్

Keeda Kola Movie: తరుణ్ భాస్కర్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. నటీనటులెవరో చెప్పకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

Advertisement
Update: 2022-12-04 04:01 GMT

టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

విజి సైన్మా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూలు పూర్తయింది. తాజాగా రెండో షెడ్యూలుని కూడా ప్రారంభించింది యూనిట్. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 లో పాన్ ఇండియా లెవెల్లో థియేట్రికల్ రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ గమ్మత్తైన విషయం ఏంటంటే.. షూటింగ్ అప్ డేట్స్ చెబుతున్నారు కానీ, ఇందులో నటిస్తున్న నటీనటులు ఎవరనేది మాత్రం దర్శకుడు చెప్పడం లేదు. నూతన నటీనటులతో పాటు, కొంతమంది సర్ ప్రైజింగ్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఉంటారని తెలుస్తోంది. ఆ సర్ ప్రైజ్ కోసమే నటీనటులు ఎవరనే విషయాన్ని బయటకు చెప్పకుండా షూటింగ్ చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News