Japan Movie | కార్తి సినిమా షూటింగ్ అప్ డేట్స్

Karthi's Japan Movie - కార్తీ హీరోగా నటిస్తున్న డిఫరెంట్ మూవీ జపాన్. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Advertisement
Update: 2023-09-15 06:56 GMT

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ ప్రస్తుతం రాజు మురుగన్ దర్శకత్వంలో 'జపాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ. డ్రీమ్‌ వారియర్స్ బ్యానర్ పై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఇదివరకే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. కార్తి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. కార్తి డబ్బింగ్ చెబుతుంటాడు. కానీ టేక్ ఎంతకీ ఓకే అవ్వదు. చివరికి టైటిల్ రోల్ జపాన్ గెటప్ తో వచ్చి చెప్పడంతో ఓకే అవుతుంది. ఈ వీడియో, అందులో జపాన్ పెక్యులర్ వాయిస్, లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో కార్తి డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు.

కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నాడు.

జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. కమ్మర సంభవం సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న వినేష్ బంగ్లాన్, ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నాడు. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News