Kamal Hassan - ఒకే వేదికపై విక్రమ్-రోలెక్స్

Kamal Hassan Suriya - విక్రమ్ సినిమా క్లయిమాక్స్ లో మెరిశాడు సూర్య. రోలెక్స్ పాత్ర అదిరింది. అప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు కమల్ హాసన్.

Advertisement
Update: 2023-04-02 14:38 GMT

విక్రమ్ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంతో తెరకెక్కిన ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్టయింది. ఆ సినిమా క్లయిమాక్స్ లో రోలెక్స్ పాత్రలో కనిపించాడు హీరో సూర్య. అయితే అది విలన్ పాత్ర. ఆ క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ తోనే విక్రమ్ సినిమా ముగుస్తుంది. పార్ట్-2కు లీడ్ కూడా ఇచ్చారు.

ఇప్పటికీ విక్రమ్ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా విక్రమ్ మూవీ ఇప్పటికీ నలుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో నటించిన కమల్ హాసన్, సూర్య ఒకే వేదికపై కలిశారు. దీంతో విక్రమ్-రోలెక్స్ కలిశారంటూ సోషల్ మీడియాలో తెగ హంగామా నడుస్తోంది.

ఓ అవార్డ్ ఫంక్షన్ లో సూర్యను వేదికపై కలిసిన కమల్ హాసన్, విక్రమ్ సినిమా సంగతులు గుర్తుచేసుకున్నాడు. కీలకమైన రోలెక్స్ పాత్ర కోసం సూర్యను అనుకున్నామని, అతడికి ఒక్క కాల్ చేసిన వెంటనే ఫోన్ లోనే ఓకే చెప్పాడని కమల్ గుర్తు చేసుకున్నాడు. సూర్య లాంటి వ్యక్తిని తను చూడలేదంటూ ప్రశంశలతో ముంచెత్తాడు. అంతేకాదు, పక్కనే ఉన్న సూర్యను ముద్దుపెట్టుకున్నాడు కూడా.

ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే వేదికపై ఉన్న లోకేష్ కనగరాజ్ కూడా స్పందించాడు. సూర్యతో కచ్చితంగా ఫుల్ లెంగ్త్ మూవీ తీస్తానని ప్రకటించి, ఫ్యాన్స్ తో ఉత్సాహం నింపాడు.

Tags:    
Advertisement

Similar News