Kajal | భగవంత్ కేసరిలో కాజల్ పాత్ర ఇదే

Kajal - భగవంత కేసరి లో కాజల్ రోల్ ఏంటి? తాజాగా ఆ మేటర్ బయటికి వచ్చింది

Advertisement
Update: 2023-10-18 07:52 GMT

బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా భగవంత్ కేసరి. అనీల్ రావిపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒక హీరోయిన్ గా శ్రీలీల నటించింది. ఆమె పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. మరి మరో హీరోయిన్ గా నటించిన కాజల్ పరిస్థితేంటి? ఆమె పాత్ర ఏంటి? 


భగవంత్ కేసరి సినిమాలో కాత్యాయని అనే సైకాలజిస్ట్ పాత్ర పోషించింది కాజల్. ఆ క్యారెక్టర్ చాలా స్మార్ట్, పైగా ఇంటెలిజెంట్ కూడా. అదే సమయంలో చాలా సరదాగా ఉంటుంది. సినిమాలో ఈ పాత్ర ద్వారానే కామెడీ పుడుతుంది. ఈ పాత్ర చేస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేసిందట కాజల్. 


ఈ కథని ఎంచుకోవడానికి కారణం చెబుతోంది కాజల్. మహిళా సాధికారిత నేపథ్యంలో ‘భగవంత్ కేసరి' సినిమా వస్తోందట. కాన్సప్ట్ తనకు చాలా నచ్చిందని, ఆడపిల్లని ధైర్యంగా పెంచడం, అలాగే మహిళా సాధికారత గురించి మాట్లాడే అవసరం ప్రస్తుత సమాజంలో ఉందని అంటోంది. అందుకే భగవంత్ కేసరి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని చెబుతోంది. 


సూపర్ స్టార్స్ ఇలాంటి కథలు చెప్పడానిని ముందుకు రావడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని అంటోంది కాజల్. బాలకృష్ణ లాంటి స్వీట్ అండ్ ఫ్రెండ్లీ పర్సన్ ను తన జీవితంలో చూడలేదంటోంది. ఇలాంటి మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళాలని... బాలయ్య ద్వారా ఇలాంటి సందేశం రావడం తనకు మరింత ఆనందాన్నిచ్చిందని చెబుతోంది. 20వ తేదీన థియేటర్లలోకి వస్తోంది భగవంత్ కేసరి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అర్జున్ రాంపాల్ ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.

Tags:    
Advertisement

Similar News