Kajal Aggarwal - భగవత్ కేసరి నుంచి కాజల్ ఫస్ట్ లుక్

Kajal Aggarwal Bhagavanth Kesari - ఈరోజు కాజల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా భగవంత్ కేసరి నుంచి ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Advertisement
Update: 2023-06-19 12:24 GMT

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా 'భగవంత్ కేసరి'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై మేకర్స్ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో వస్తూ బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ అందిస్తున్నారు. టైటిల్‌ను విడుదల చేసిన అనంతరం టీజర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ రోజు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ చీరలో హోమ్లీగా కనిపించింది. సైకాలజీ పుస్తకం చదువుతూ ఫోన్‌లో మాట్లాడుతూ, పెద్ద అద్దాలు ధరించింది చిరునవ్వుతో కనిపించడం ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. భగవంత్ కేసరి దసరాకి థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News