Kajal Aggarwal - పెళ్లి తర్వాత ఘోస్టీగా మారిన కాజల్

Kajal Aggarwal - పెళ్లి తర్వాత కాజల్ నటించిన తమిళ సినిమా ఘోస్టీ. ఇప్పుడీ సినిమా ఇదే టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది.

Advertisement
Update: 2023-03-10 15:47 GMT

కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ నటుడు యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన తమిళ సినిమా 'ఘోస్టీ'. కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఘోస్టీ మూవీలో కాజల్ అగర్వాల్ ద్విపాత్రాభినయం చేసింది. పోలీస్, హీరోయిన్... రెండు పాత్రల్లో ఆమె కనిపించనుంది. రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏమిటనేది ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేస్తుందట ఈ సినిమా. సామ్ సిఎస్ సంగీతం అందించాడు.

త్వరలో 'ఘోస్టీ' తెలుగు ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునే ఒత్సాహిక దర్శకుడిగా యోగిబాబు కనిపించనున్నాడు. తనతో పాటు స్నేహితులను మణిరత్నం అసిస్టెంట్లుగా కాజల్ అగర్వాల్‌కు పరిచయం చేసుకుంటాడు. హీరోయిన్ దగ్గరకు వెళ్ళబోయి పోలీస్ దగ్గరకు వెళతాడు.

యోగిబాబు మాత్రమే కాదు, చాలా మంది ఆ విధంగా కన్‌ఫ్యూజ్ అవుతారు. హీరోయిన్ అనుకుని దగ్గరకు వచ్చిన వాళ్ళతో 'నేను పోలీస్' అని చెబుతూ కాజల్ కొట్టడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇందులో కె.ఎస్. రవికుమార్ గన్స్ డీల్ చేసే మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ కథలోకి ఆత్మలు ఎలా వచ్చాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

Tags:    
Advertisement

Similar News