Jio Cinema | రిలయన్స్ చేతికి హాట్ స్టార్

JIO Disney Hotstar - త్వరలోనే మీడియా రంగంలో మరో పెద్ద ఒప్పందం తెరపైకి రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిస్నీ హాట్ స్టార్ కంపెనీ జియో వశమౌతుంది.

Advertisement
Update: 2023-10-24 17:07 GMT

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మరో కీలక ముందడుగు వేసింది. వాల్ట్ డిస్నీ కంపెనీతో బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. తాజా ఒప్పందం ప్రకారం హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ కంపెనీలు, రిలయన్స్ జియోలో కలుస్తాయి. అయితే ఈ ఒప్పందంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఈ ఒప్పందం విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. ఒప్పందం కార్యరూపం దాలిస్తే, స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ లో రిలయన్స్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది. వచ్చే నెలలో, ఈ రెండు కంపెనీలు ఈ ఒప్పందాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఒప్పందం రిలయన్స్ లోని మీడియా సంస్థలు, డిస్నీ స్టార్‌ల మధ్య విలీనానికి దారితీయవచ్చు. తద్వారా హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ రిలయన్స్ జియోకి మారతాయి.

గడిచిన కొన్నేళ్లుగా మీడియా రంగంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే జీ గ్రూప్ లో సోనీ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది. దాదాపు 51శాతం వాటాను దక్కించుకుంది. అంతకంటే ముందు డిస్నీ కూడా గ్రాండ్ గా ఇండియాలో ప్రవేశించింది. ఇప్పుడు డిస్నీ నుంచి రిలయెన్స్ కు కొన్ని కంపెనీలు మారబోతున్నాయి.

గతేడాది ఐపీఎల్ ను 2.7 బిలియన్ డాలర్లకు ప్రసారం చేయడానికి అంబానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాదు, జియో సినిమా యాప్ లో క్రికెట్ మ్యాచుల్ని ఉచితంగా ప్రసారం చేసింది. దీంతో ఈ యాప్ కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు తమ వినోదరంగ వ్యాపారాన్ని, హాట్ స్టార్ కొనుగోలుతో మరింత ముందుకు తీసుకెళ్లోంది జియో.

Tags:    
Advertisement

Similar News