Jimmy Jimmy In China: చైనాలో పాపులర్ అవుతున్న బాలీవుడ్ సాంగ్!

Jimmy Jimmy In China: 1982లో మిథున్‌ చక్రవర్తి హీరోగా వచ్చిన బాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘డిస్కో డ్యాన్సర్‌’. దానికి బప్పీలహరి మ్యూజిక్‌. అందులో ‘జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా’ అనే పాట ఇప్పుడు చైనా సోషల్‌ మీడియాలో విపరీతంగా వినిపిస్తోంది.

Advertisement
Update: 2022-11-03 09:21 GMT

Jimmy Jimmy In China: ప్రపంచమంతా కరోనాను మర్చిపోయి ఎవరిపనులు వాళ్లు చేసుకుంటుంటే చైనాలో మాత్రం ఇంకా కొవిడ్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. గత రెండేళ్లుగా చైనా ప్రజలు లాక్‌డౌన్‌ లతో మానసికంగా కుంగిపోతున్నారు. తాజాగా బీజింగ్‌ సహా ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తుండడంతో జనాలు ఊళ్లు విడిచి పారిపోతున్నారు కొందరు. అయితే మరోవైపు కఠిన లాక్‌డౌన్‌లకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తమ కోపాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మన బాలీవుడ్ సాంగ్ ఒకటి అక్కడ హల్‌చల్ చేస్తుంది.

1982లో మిథున్‌ చక్రవర్తి హీరోగా వచ్చిన బాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ 'డిస్కో డ్యాన్సర్‌'. దానికి బప్పీలహరి మ్యూజిక్‌. అందులో 'జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా' అనే పాట ఇప్పుడు చైనా సోషల్‌ మీడియాలో విపరీతంగా వినిపిస్తోంది. మాండరిన్‌ భాషలో 'జియ్‌ మీ అంటే 'బియ్యం ఇవ్వమ'ని అర్థం. లాక్‌డౌన్‌ దెబ్బకు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని, వాళ్ల కోసం ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలని కోరుతూ ఇలా సెటైరిక్‌గా ఈ జియ్‌ మీ జియ్‌ మీ (జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా) సాంగ్‌ ద్వారా నిరసన తెలుపుతున్నారు. చైనాలో ఈ పాటను రీమిక్స్ చేసిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.



Tags:    
Advertisement

Similar News