Japan Movie | వారం రోజులకే ముగిసిన జపాన్ కథ

Japan Movie - కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమా జపాన్. దీపావళికి రిలీజైన ఈ సినిమా నాగులచవితి నాటికి క్లోజ్ అయింది.

Advertisement
Update: 2023-11-17 16:18 GMT

కార్తీ నటించిన జపాన్ సినిమా కేవలం వారం రోజుల్లోనే థియేటర్ల నుండి వైదొలిగింది. ఈ చిత్రం కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. తన కెరీర్ లో ల్యాండ్‌మార్క్ మూవీతో దురదృష్టవశాత్తు, అతిపెద్ద డిజాస్టర్‌ అందుకున్నాడు కార్తి. అతి తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా, జపాన్ సినిమా కేవలం ఒక వారంలోనే థియేటర్ల నుండి తీసేశారు.

నవంబర్ 10న విడుదలైన జపాన్ సినిమాకు మొదటి రోజు మొదటి ఆటకే నెగెటివ్ టాక్ వచ్చేసింది. భయంకరమైన మౌత్ టాక్ తో ఈ సినిమా ఇబ్బంది పడింది. కోలీవుడ్ తో పాటు, దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే టాక్ వినిపించింది. అయితే, దీపావళి సెలవు రావడంతో, వారాంతంలో ఈ చిత్రం తమిళనాడులో మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత పూర్తిగా క్రాష్ అయింది.

ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉండడంతో థియేటర్ యజమానులెవ్వరూ ఈ సినిమాను కొనసాగించడానికి ఇష్టపడలేదు. ఇక ఆన్ లైన్ బుకింగ్స్ విషయానికొస్తే.. బుక్ మై షో యాప్‌లో, ఈ చిత్రం అత్యల్ప రేటింగ్‌ను పొందింది, కేవలం 5.1 రేటింగ్‌తో, ప్రేక్షకులు సినిమాను పూర్తిగా తిరస్కరించినట్లు చూపిస్తుంది. తన ల్యాండ్ మార్క్ మూవీతో భారీ ఎదురుదెబ్బ తిన్నాడు కార్తి.

రాజు మురుగన్ రచన-దర్శకత్వంలో వచ్చింది జపాన్ సినిమా. ఒక హీస్ట్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఇందులో కార్తి సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. సునీల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News