Ilaiyaraaja Biopic | ధనుష్ హీరోగా ఇళయరాజా బయోపిక్

Ilaiyaraaja Biopic - ఎట్టకేలకు మ్యాస్ట్రో బయోపిక్ ‘ఇళయరాజా’ పేరుతో చెన్నైలో ప్రారంభమైంది. ధనుష్ హీరోగా వస్తోంది.

Advertisement
Update: 2024-03-22 16:10 GMT

మాస్ట్రో గా ప్రేక్షకులను తన సంగీత స్వర సాగరంలో ముంచెత్తిన ఇళయరాజా అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు. అందుకు కారణం చాలా రోజుల నుంచి వారు ఇళయరాజా బయోపిక్ ఎప్పుడు ప్రారంభమవుతుందా! అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు మ్యాస్ట్రో బయోపిక్ ‘ఇళయరాజా’ పేరుతో చెన్నైలో ప్రారంభమైంది.

ఈ వేడుకకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఇళయరాజా మూర్తీభవించిన రెట్రో లుక్‌లో ధనుష్ కనిపిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ ఈ బయోపిక్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు.

కనెక్ట్ మీడియా, పి.కె.ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యురీ మూవీస్ బ్యానర్స్‌పై ఈ సినిమా రాబోతోంది. నీరవ్ షా ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ కాగా.. ముత్తురాజ్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ కార్యక్రమంలో ఇళయరాజా కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇళయరాజాగారి సంగీతం నన్ను నటుడిగా మెరుగుపరుచుకోవటానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఏదైనా అసాధారణ పాత్రలో నేను నటించాల్సి వచ్చినప్పుడు ఇళయరాజాగారి పాటలను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటాను. అవి నాలోని నటనను పరిపూర్ణంగా ఆవిష్కరించేలా చేస్తాయి. ఈ సినిమాలో ఆయన పాత్రను పోషించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు" అంటూ స్బందించాడు.

Tags:    
Advertisement

Similar News