Oscar 2023: ఆస్కార్ కు నామినేట్ అయిన కాంతారా.. హోంబలే ఫిల్మ్స్ ప్రకటన

Kantara Movie in Oscar 2023: బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను ఈ సినిమా నామినేట్ అయ్యింది. కాంతారా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అవడంపై చిత్ర నిర్మాతలు, నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2023-01-10 07:40 GMT

ఇండియా నుంచి ఆస్కార్ అవార్డ్స్ కు మరో సినిమా నామినేట్ అయ్యింది. కాంతారా సినిమా ఆస్కార్ కు నామినేట్ అయినట్టు ఆ మూవీని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా కాంతారా.

ఈ సినిమాకు ఆయనే కథ అందించడంతోపాటు దర్శకత్వం కూడా చేశాడు. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 450 కోట్ల వసూళ్లు సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా 20 నిమిషాల క్లైమాక్స్ ప్రేక్షకులను రంజింపజేసింది. ఇంతటి విజయం సాధించిన ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని కాంతారా సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. రెండు కేటగిరిల్లో ఈ సినిమా నామినేట్ అయినట్లు నిర్మాతలు తెలిపారు.

బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను ఈ సినిమా నామినేట్ అయ్యింది. తాము ఒక చిన్న సినిమాగా రూపొందించిన కాంతారా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించడంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అవడంపై చిత్ర నిర్మాతలు, నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాల్లో ఆర్ఆర్ఆర్, చెల్లో షో ఉన్నాయి. ఆస్కార్ నామినేషన్స్ లో షార్ట్ లిస్టు జాబితాలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు స్థానం దక్కింది.

Tags:    
Advertisement

Similar News