Poorna: తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ

Heroine Poorna: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న పూర్ణ, ఇదే ఏడాది గర్భందాల్చింది. తను త్వరలోనే తల్లిని కాబోతున్నానని ప్రకటించింది.

Advertisement
Update: 2022-12-31 15:30 GMT

ఒకప్పట్లా హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాలు ఆపేయడం లేదు. పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఇది పాత వార్త. కొత్త మేటర్ ఏంటంటే.. ఒకప్పట్లా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత గ్యాప్ తీసుకోవడం లేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లల్ని కనేస్తున్నారు.

మొన్నటికిమొన్న కాజల్ ఇలా పెళ్లి చేసుకొని, అలా కొడుక్కి జన్మనిచ్చింది. ఇదే ఏడాది పెళ్లి చేసుకున్న అలియా భట్, సేమ్ ఇయర్ లో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడీ కోవలోకి మరో నటి కూడా చేరింది. ఆమె పేరు పూర్ణ.

ఈ ఏడాది పెళ్లి చేసుకున్న పూర్ణ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా గర్భవతి అయింది. త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ వీడియో విడుదల చేసి మరీ ప్రకటించింది.

ఈ ఏడాదిలోనే పూర్ణ పెళ్లి చేసుకుంది. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడింది. అలా పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే తను గర్భందాల్చినట్టు ప్రకటించింది. కొత్త ఏడాదిలో తమ జీవితాల్లోకి సంతానాన్ని ఆహ్వానించబోతున్నారు పూర్ణ దంపతులు.

Tags:    
Advertisement

Similar News