Jai Hanuman | జై హనుమాన్ ప్రీ-ప్రొడక్షన్

Jai Hanuman Movie - సూపర్ హిట్టయిన హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతోంది. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ కూడా మొదలైంది.

Advertisement
Update: 2024-01-23 17:03 GMT

ప్రపంచవ్యాప్తంగా 'హను-మాన్' చారిత్రాత్మక విజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడీ క్రియేటివ్ డైరెక్టర్, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నాడు.

ప్రీక్వెల్ ముగింపులో ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్ 'అనే సీక్వెల్‌ను అనౌన్స్ చేశాడు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌కి సంబంధించి దర్శకుడు ఇప్పటికే స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఇది లార్జర్ దేన్ లైఫ్ కథతో భారీ కాన్వాస్ తో రాబోతోంది.

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజున, ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో యాగంలో పాల్గొన్నాడు. ప్రాజెక్ట్ కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి సినిమా స్క్రిప్ట్‌ను హనుమంతుని విగ్రహం ముందు ఉంచాడు. ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తమకు లభించదని అన్నాడు.

ఈ సందర్భంగా రెండు పోస్టర్లను విడుదల చేశాడు. ఒకటి ప్రశాంత్ వర్మ హనుమంతుని ముందు నిలబడి స్క్రిప్ట్‌ను పట్టుకున్నట్లు చూపిస్తే, మరొకటి సీక్వెల్ కోసం హను-మాన్ సినిమా నుంచి చివర్లో చూపించిన స్టిల్. 




Tags:    
Advertisement

Similar News