Hanuman OTT | ఆ ఓటీటీలోకి కూడా హనుమాన్ సినిమా

Hanuman OTT: తెలుగు వెర్షన్ ఆల్రెడీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు మిగతా దక్షిణాది భాషల్లో కూడా హనుమాన్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.

Advertisement
Update: 2024-03-26 03:53 GMT

తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ, అక్కడ కూడా దుమ్ముదులుపుతోంది. రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పుడీ సినిమా మరో ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది.

అవును.. త్వరలోనే హనుమాన్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కనిపించనుంది. తెలుగు వెర్షన్ ను జీ5 ఆల్రెడీ స్ట్రీమింగ్ కు పెట్టగా.. మిగతా సౌత్ భాషల స్ట్రీమింగ్ రైట్స్ ను డిస్నీ దక్కించుకుంది. ఏప్రిల్ 5 నుంచి హనుమాన్ తమిళ వెర్షన్ ను డిస్నీ హాట్ స్టార్ లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. తమిళ వెర్షన్ వచ్చిన కొన్ని రోజులకే అదే ఓటీటీలో మలయాళం, మలయాళ వెర్షన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

ఈ సినిమా హిందీ వెర్షన్ ను ఆల్రెడీ టెలికాస్ట్ చేశారు. జియో సినిమాలో స్ట్రీమింగ్ కు కూడా పెట్టారు. త్వరలోనే తెలుగు వెర్షన్ ను జీ తెలుగులో ప్రసారం చేయబోతున్నారు. నిజానికి ఈ ఉగాదికే హనుమాన్ ను టెలికాస్ట్ చేయాలని జీ తెలుగు భావించినప్పటికీ, మిగతా ఛానెళ్లలో పోటీ గట్టిగా ఉండడంతో.. తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఈ ఉగాదికి జెమినీలో గుంటూరుకారం వస్తోంది.

Tags:    
Advertisement

Similar News